28 October 2026

రామ ఏకాదశి 2026: తేదీ, శుభ సమయాలు, పూజా విధానం, వ్రత కథ మరియు దానధర్మాల ప్రాముఖ్యత

Start Chat

సనాతన ధర్మంలో ఏకాదశి తిథిని శ్రీమహావిష్ణువుని పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతి నెలలో రెండుసార్లు వచ్చే ఏకాదశి రోజులు భక్తితో, నియమ నిష్ఠలతో, ఉపవాసంతో, భగవంతుడిని స్మరించుకుంటూ మనసును శుద్ధి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఏడాది పొడవునా వచ్చే ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి మరింత ప్రత్యేకమైనది. దీనినే రామ ఏకాదశి అని పిలుస్తారు.

మత విశ్వాసాల ప్రకారం, రామ ఏకాదశి పాపాల నుంచి విముక్తి పొందడానికి, పుణ్యం సంపాదించడానికి సహాయపడే పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని పూజించడం, హరి నామాన్ని జపించడం, ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం, అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం ఎంతో మంచిదని నమ్ముతారు. రామ ఏకాదశికి లక్ష్మీదేవితో కూడా ప్రత్యేక సంబంధం ఉంది. ఎందుకంటే ‘రమా’ అనేది లక్ష్మీదేవి పేర్లలో ఒకటి.

 

రామ ఏకాదశి 2026 ఎప్పుడు జరుపుకుంటారు?

2026లో రామ ఏకాదశిని నవంబర్ 5, గురువారం రోజున జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి నవంబర్ 4 ఉదయం 11:03 గంటలకు ప్రారంభమై, నవంబర్ 5 ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి సంప్రదాయం ప్రకారం నవంబర్ 5న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

వ్రతం ముగించి ఉపవాసం విరమించే పారాయణ సమయం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందువల్ల భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని చూసి, సరైన ద్వాదశి తిథి పారణ సమయాన్ని తెలుసుకోవాలి.

 

రామ ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

రామ ఏకాదశిని శ్రీమహావిష్ణువుపై భక్తి, శరణాగతి చాటుకునే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, ఉపవాసం ఉంటామని సంకల్పం చేసుకుని, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. శ్రీహరి నామాన్ని జపించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, భగవంతుడిని స్మరించడం, మంచి పనులు చేయడం ద్వారా ఈ రోజు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నమ్ముతారు.

రామ ఏకాదశికి సంబంధించిన కథ పద్మ పురాణంలో ఉంది. ఇందులో శ్రీకృష్ణుడు రాజు యుధిష్ఠిరుడికి ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని వివరిస్తారు.

 

రమా ఏకాదశి వ్రత కథ

పూర్వకాలంలో ముచుకుందుడు అనే ధార్మిక రాజు ఉండేవాడు. ఆయన శ్రీమహావిష్ణువుకు పరమ భక్తుడు. ఆయన కుమార్తె చంద్రభాగాకి శోభనుడు అనే యువకుడితో వివాహం జరిగింది. ఒకసారి కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే రమా ఏకాదశి సమయంలో శోభనుడు తన భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు.

రాజైన ముచుకుందుని రాజ్యంలో ఏకాదశి ఉపవాసం పాటించడం ఒక నియమంగా ఉండేది. ఆ రోజున ప్రజలే కాకుండా, రాజ్యంలో ఉన్న పశుపక్ష్యాదులకు కూడా ఆహారం ఇచ్చేవారు కాదు. శోభనుడు శారీరకంగా చాలా బలహీనంగా ఉండేవాడు, ఎక్కువ సమయం ఆకలిని తట్టుకోలేకపోయేవాడు. అయినప్పటికీ, ఎలాగోలా నిష్టతో ఏకాదశి ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నాడు.

ఆ ఉపవాస ప్రభావాన, తట్టుకోలేక శోభనుడు కన్నుమూశాడు. చంద్రభాగా తన భర్తతో కలిసి సతీసహగమనం చేయాలనుకుంది, కానీ తండ్రి సలహా మేరకు మరియు విష్ణుమూర్తిపై ఉన్న నిశ్చలమైన భక్తితో ఆ పని విరమించుకుంది. నాటి నుండి ఆమె తన జీవితాన్ని శ్రీహరి భక్తికి, ఏకాదశి ఉపవాస నియమాలకే అంకితం చేసింది.

మా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్యఫలం వల్ల శోభనుడికి దేవలోకంలో ఒక అద్భుతమైన నగరం మరియు రాజ్యం లభించాయి. ఒకసారి ముచుకుందుని రాజ్యానికి చెందిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ దివ్య రాజ్యాన్ని చేరుకుని, శోభనుడిని గుర్తుపట్టాడు.

రమా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్లే తనకు ఈ దివ్య రాజ్యం లభించిందని శోభనుడు ఆయనకు చెప్పాడు. అయితే, తాను పూర్తి శ్రద్ధ లేకుండా ఆ ఉపవాసం చేయడం వల్ల ఈ రాజ్యం శాశ్వతమైనది కాదని వివరించాడు.

సోమశర్మ తిరిగి వచ్చి తాను చూసిన విషయాలన్నీ చంద్రభాగాకి చెప్పాడు. చంద్రభాగా తాను ఇన్ని సంవత్సరాలుగా పరమ భక్తితో ఆచరిస్తున్న ఏకాదశి వ్రతాల పుణ్యఫలాన్ని తన భర్తకు ధారపోసింది. కథ ప్రకారం… ఆ పుణ్యఫలంతో శోభనుడి రాజ్యం శాశ్వతంగా మారింది, ఆ దంపతులిద్దరూ సుఖసంతోషాలతో కలిసి జీవించారు.

 

రామ ఏకాదశి పూజా విధానం

  • రామ ఏకాదశి రోజున వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శ్రీమహావిష్ణువు ముందు ఉపవాసం ఉంటామని సంకల్పం చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి, శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి.
  • శ్రీహరికి పసుపు పూలు, తులసి ఆకులు, చందనం, అక్షతలు, నైవేద్యం సమర్పించి భక్తితో పూజ చేయాలి. శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించాలి. మీ భక్తి, సామర్థ్యాన్ని బట్టి విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా రామ ఏకాదశి వ్రత కథను చదవాలి లేదా వినాలి. చివరగా హారతి ఇచ్చి, భగవంతుడిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం కోరాలి.
  • ఏకాదశి ఉపవాసాన్ని మీ ఆరోగ్యం, సామర్థ్యాన్ని బట్టి ఆచరించాలి. నీటితో మాత్రమే ఉపవాసం ఉండడం, పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయడం వంటి వివిధ రకాల ఉపవాస పద్ధతులు మత సంప్రదాయాల్లో ఉన్నాయి.
  • రోజంతా ప్రశాంతంగా, సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి. కోపం, గొడవలు, చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ వీలైనంత ఎక్కువ సమయం భగవంతుడి నామస్మరణ, భక్తిలో గడపాలి. ద్వాదశి తిథి రోజున మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగంలో సూచించిన సరైన సమయంలో ఉపవాసాన్ని విరమించాలి.

సనాతన సంప్రదాయంలో దానం చేయడం అనేది దయ, స్వార్థం లేకుండా చేసే సేవకు గుర్తుగా భావిస్తారు. పవిత్రమైన ఏకాదశి రోజు మనం భగవంతుడిని భక్తితో స్మరించడమే కాకుండా, ఇతరులకు సేవ చేయాలని, మంచి పనులు చేయాలని కూడా మనకు స్ఫూర్తినిస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిస్సహాయులకి అండగా నిలవడం నిజమైన మానవత్వానికి నిదర్శనంగా భావిస్తారు. భక్తిని సేవతో కలిపినప్పుడు మన పూజ మరింత అర్థవంతంగా మారుతుంది.

ఈ పవిత్రమైన రమా ఏకాదశి సందర్భంగా, నారాయణ సేవా సంస్థ నిర్వహిస్తున్న పేదలు, అవసరంలో ఉన్నవారు మరియు దివ్యాంగ పిల్లల అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సాయం అందించండి. కష్టాల్లో ఉన్న ఒక చిన్నారికి పౌష్టికాహారంతో పాటు తియ్యని భోజనాన్ని అందించడంలో తోడ్పడండి, అన్నదానం ద్వారా వారి ముఖంలో చిరునవ్వులు నింపే గొప్ప పవిత్ర సంకల్పం తీసుకోండి.

ఈ రమా ఏకాదశి రోజున శ్రీహరిని స్మరిస్తూ, లక్ష్మీదేవిని ధ్యానిస్తూ, హరి నామస్మరణ చేస్తూ… ఇతరులకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ పూనండి. మీ శక్తికొలదీ అవసరంలో ఉన్నవారికి సాయపడి, భక్తిని నిస్వార్థ సేవతో జోడించి ఈ పవిత్రమైన రోజుని సార్థకం చేసుకోండి.

 

 

 

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 2026లో రామ ఏకాదశిని ఎప్పుడు జరుపుకుంటారు?

జవాబు: 2026లో రామ ఏకాదశిని నవంబర్ 5, గురువారం రోజున జరుపుకుంటారు.

ప్రశ్న: రామ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

జవాబు: రామ ఏకాదశి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి అంకితం చేసిన పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండడం, శ్రీమహావిష్ణువును పూజించడం, హరి నామాన్ని జపించడం, దానధర్మాలు చేయడం, ఇతరులకు సేవ చేయడం ముఖ్యమైనవిగా మత సంప్రదాయాల్లో భావిస్తారు.

ప్రశ్న: రామ ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారు?

జవాబు: మత విశ్వాసాల ప్రకారం, రామ ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం ఉండడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు.

ప్రశ్న: రామ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు ఎవరిని పూజిస్తారు?

జవాబు: రామ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం సంప్రదాయం.

ప్రశ్న: రామ ఏకాదశి పూజలో శ్రీమహావిష్ణువుకు ఏమి సమర్పించాలి?

జవాబు: పూజలో శ్రీమహావిష్ణువుకి తులసి ఆకులు, పసుపు పూలు, చందనం, అక్షతలు, నైవేద్యాన్ని భక్తితో సమర్పించడం సంప్రదాయం.

X
Amount = INR