kartik purnima

కార్తీక పౌర్ణిమ నాడు దానం చేయండి మరియు అవసరంలో ఉన్నవారికి, నిస్సహాయులకు అలాగే దివ్యాంగ పిల్లలకు అన్నదానం చేయండి

కార్తీక పూర్ణిమ

Amount = INR
X

సనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమిని ఎంతో పవిత్రమైన, శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని, పరమశివుడిని పూజించడం, దీపాలు వెలిగించడం, పవిత్ర స్నానాలు చేయడం, ప్రార్థనలు చేయడం, తపస్సు ఆచరించడం, దానధర్మాలు చేయడం, ఇతరులకు సేవ చేయడం ఎంతో విశేషమైనవి. మత విశ్వాసాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించడం, దీపాలు వెలిగించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే మనసులో భక్తి, ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని నమ్ముతారు.

 

కార్తీక పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, శ్రీమహావిష్ణువుని పూజించడం, హరి నామస్మరణ చేయడం, దీపాలు వెలిగించడం, దానధర్మాలు చేయడం మన సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనవి. కార్తీక మాసంలోని ఈ పౌర్ణమి మన జీవితంలో భక్తి, విశ్వాసంతో పాటు దయ, దానం, ఇతరులకు సేవ చేయడం కూడా అలవాటు చేసుకోవాలని గుర్తుచేస్తుంది.

ఈ పండుగని దైవ దీపావళి అని కూడా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి పవిత్ర నదుల ఒడ్డున దీపాలు వెలిగిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చీకటిలో దీపం వెలిగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. మన జీవితాల్లో జ్ఞానం అనే వెలుగును నింపడం, అందరిలో ఐక్యతను పెంచడం, ఆశను కలిగించడం కూడా దీని వెనుక ఉన్న గొప్ప సందేశం.

 

దానధర్మాలు, సేవ చేయడం యొక్క ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమి రోజున దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్నదానం చేయడం, ఆహారం, నిత్యావసర వస్తువులు అందించడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం గొప్ప సేవగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, మరొకరి ముఖంలో చిరునవ్వు తీసుకురావడం కూడా దేవుడిని పూజించడంతో సమానమే.

శ్రీమద్భాగవత మహాపురాణంలో శ్రీకృష్ణుడు దానం గురించి చెబుతూ, దానాన్ని విశ్వాసం, ధర్మంతో ముడిపెట్టాడు.

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్॥

అర్థం: తిరిగి ఏదైనా ఆశించకుండా, తన ధర్మంగా భావించి, సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, దానానికి అర్హులైన వారికి చేసే దానాన్ని సాత్త్విక దానం అంటారు. అంటే, ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేసే దానమే నిజమైన దానం.

 

పేద, అవసరంలో ఉన్న, దివ్యాంగ పిల్లలకు అన్నదానం చేయండి

ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా, నారాయణ సేవా సంస్థ పేద, అవసరంలో ఉన్న, నిస్సహాయ, దివ్యాంగ పిల్లలకు ఆహారం అందించే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శుభదినాన మీ భక్తిని సేవతో, అవసరంలో ఉన్న పిల్లలకు పౌష్టికమైన, రుచికరమైన భోజనం అందించే ఈ మంచి కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి.

కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువుని స్మరించుకోండి, దీపాలు వెలిగించండి, దానం చేయాలని సంకల్పించండి. ఇతరులకు సేవ చేయడం ద్వారా మానవత్వం పట్ల మీకున్న ప్రేమను చాటుకోండి. మీరు ఇచ్చే చిన్న విరాళం కూడా అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించడంతో పాటు, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపగలదు. తమను కూడా ఎవరైనా పట్టించుకుంటున్నారనే ఆత్మీయ భావనను కలిగించగలదు.

కార్తీక పూర్ణిమ

కార్తీక పూర్ణిమ రోజున పేద, నిస్సహాయ, దివ్యాంగ పిల్లలకు అన్నదానం చేయడానికి సహాయం చేయండి

మీరు ఇచ్చే విరాళంతో దివ్యాంగ పిల్లలకు భోజనం అందించవచ్చు.

Bank Details

Account Name
Narayan Seva Sansthan
Bank Name
STATE BANK OF INDIA
Account Number
31505501196
IFSC Code
SBIN0011406
Avail tax exemption under Section 80G
Image Gallery
చాట్ ప్రారంభించండి