• +91-7023509999
  • 0294-6622222
  • info@narayanseva.org
  • Home
  • కార్పొరేట్ సామాజిక బాధ్యత
Corporate Social Responsibility

CSR ద్వారా ఒకరి జీవితాన్ని మార్చండి

మీ సహాయం దివ్యాంగులు, పేదలు మరియు అవసరంలో ఉన్న వారికి కొత్త ఆశ, ఆత్మవిశ్వాసం, స్వయం ఆధారిత జీవితం మరియు గౌరవం అందించడానికి ఒక బలమైన పునాదిగా మారవచ్చు.

మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (కార్పొరేట్ సామాజిక భాద్యత)(CSR) భాగస్వామ్యానికి స్వాగతం

నారాయణ సేవా సంస్థకు స్వాగతం. 1985 నుంచి నారాయణ సేవా సంస్థ పేదలు, సహాయం అవసరమైన దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారు మరియు అవసరంలో ఉన్న వారి జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. దివ్యాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాలు మరియు కాలిపర్స్ అందించడం, నైపుణ్య శిక్షణ, విద్య, సామూహిక వివాహాలు వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మళ్లీ ఆనందం మరియు ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చింది.

ఈ గొప్ప సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సంస్థ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. మీ CSR సహాయంతో, మనం మరింత మంది పేదలకు వైద్యం, పునరావాసం, విద్య మరియు స్వయం ఉపాధి మార్గాలను అందించవచ్చు. వనరులు లేవనే ఒక్క కారణంతో ఎవరూ తమ కలలకు దూరం కాకూడదనే సమాజాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి పనిచేద్దాం.

CSR

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (కార్పొరేట్ సామాజిక భాద్యత) (CSR) అంటే ఏమిటి?

  • కార్పొరేట్  (కార్పొరేట్ సామాజిక భాద్యత) (CSR) అనేది వ్యాపార సంస్థలు తమ వ్యాపారంతో పాటు సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనస్ఫూర్తిగా నెరవేర్చే ఒక మార్గం.
  • CSR ద్వారా కంపెనీలు దివ్యాంగుల సాధికారత, విద్య, ఆరోగ్య సేవలు, పర్యావరణ పరిరక్షణ మరియు ఇతర సామాజిక కార్యక్రమాలకు సహాయం చేస్తాయి. దీని ద్వారా సమాజంలో మంచి మార్పును తీసుకురావచ్చు.
  • భారతదేశంలో సంస్ధల చట్టం 2013 ప్రకారం, అర్హత కలిగిన సంస్ధలు తమ CSR నిబంధనల ప్రకారం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి.

 

మా ముఖ్యమైన CSR సేవా రంగాలు

సమాజంలో మంచి, దీర్ఘకాలిక మార్పు తీసుకురావడానికి నారాయణ్ సేవా సంస్థ వివిధ CSR కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

  • వైద్య సేవలు: దివ్యాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు(సర్జరీలు) మరియు కృత్రిమ అవయవాలను అందిస్తూ, వారు సొంత కాళ్ళపై నిలబడేలా, మంచి జీవితాన్ని గడిపేలా సహాయపడటం. (SDG 3: మంచి ఆరోగ్యం & శ్రేయస్సు)
  • విద్య: దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారికి నైపుణ్య ఆధారిత విద్య, శిక్షణ అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, స్వయం ఆధారంగా జీవించేందుకు సిద్ధం చేయడం. (SDG 4: నాణ్యమైన విద్య)
  • నైపుణ్యాభివృద్ధి: దివ్యాంగులు మరియు వెనుకబడిన వర్గాల వారు గౌరవప్రదంగా జీవించడానికి వృత్తి విద్యా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం. (SDG 8: గౌరవప్రదమైన పని & ఆర్థిక వృద్ధి)
  • సామాజిక సమానత్వం: అవగాహన కార్యక్రమాలు మరియు ప్రత్యేక వసతుల ద్వారా దివ్యాంగులను సమాజంలో అందరితో పాటు సమానంగా భాగస్వాములను చేయడం. (SDG 10: అసమానతల తగ్గింపు)
Join Hand With Us →
CSR

మా CSR కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వల్ల ప్రయోజనాలు

Partnering with Narayan Seva Sansthan empowers your brand to create measurable social impact while fulfilling CSR goals.

మెరుగైన బ్రాండ్ గుర్తింపు

మెరుగైన బ్రాండ్ గుర్తింపు

CSR కార్యక్రమాలను పవిత్రమైన మరియు ప్రత్యేక సందర్భాలతో అనుసంధానించడం ద్వారా బ్రాండ్‌కు మరింత గుర్తింపు లభిస్తుంది.

ఉద్యోగుల భాగస్వామ్యం

ఉద్యోగుల భాగస్వామ్యం

ఏడాది పొడవునా ప్రత్యేక సందర్భాల్లో సేవా కార్యక్రమాల్లో ఉద్యోగులను భాగస్వామ్యం చేయండి.

వాల్యుయేషన్ ప్రీమియం

వాల్యుయేషన్ ప్రీమియం

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం, బలమైన CSR కార్యక్రమాలు కంపెనీ వాల్యుయేషన్‌లో 11% పెరుగుదలకు దోహదపడతాయి.

సమాజంపై ప్రభావం

సమాజంపై ప్రభావం

ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో దానం చేయడం ద్వారా దివ్యాంగులకు సహాయం చేయండి.

సుస్థిరమైన మార్పు

సుస్థిరమైన మార్పు

ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే దీర్ఘకాలిక ప్రాజెక్టుల ద్వారా స్థిరమైన మార్పును తీసుకురండి.

Become a Change Partner

CSR కోసం నారాయణ సేవా సంస్థని ఎందుకు ఎంచుకోవాలి?

మీ CSR లక్ష్యాలను సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు నిజమైన ఫలితాలు ఇచ్చే విధంగా పూర్తి చేయడానికి మా సేవా అనుభవాన్ని, నమ్మకాన్ని ఎంచుకోండి.

విశ్వసనీయమైన సేవా చరిత్ర
1985 నుంచి ఇప్పటివరకు, దివ్యాంగుల కోసం 4,51,057 కంటే ఎక్కువ ఉచిత సరిదిద్దే శస్త్రచికిత్సలు అందించడంలో మేము సహాయపడ్డాం. దీని ద్వారా లక్షలాది మంది జీవితాల్లో కొత్త ఆశను తీసుకురాగలిగాం.
భారతీయ సంస్కృతి మరియు సేవల కలయిక
మతపరమైన మరియు సామాజిక సందర్భాల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, మేము ప్రజలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే, అవసరంలో ఉన్న వారికి అర్థవంతమైన సామాజిక సేవను అందిస్తున్నాం.
కొత్త ఆలోచనలతో పునరావాసం
ఇప్పటివరకు 1,00,000 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించాం. వారు మళ్లీ స్వతంత్రంగా, తమ కాళ్లపై తాము నిలబడి జీవించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.
సమాజం ఆధారంగా సాధికారత
దూర ప్రాంతాల్లో నివసించే దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారి అవసరాలను అర్థం చేసుకుని, వారి అభివృద్ధి మరియు పునరావాసం కోసం పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాం.
మీ CSR లక్ష్యాలకు అనుగుణమైన కార్యక్రమాలు
మీ సంస్ధ CSR ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆరోగ్య సేవలు, విద్య, నైపుణ్య అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నాం.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ
దివ్యాంగుల సేవ, సామాజిక బాధ్యత మరియు సమాజ అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలకు నారాయణ సేవా సంస్థకు దేశవ్యాప్తంగా అనేక గౌరవాలు మరియు అవార్డులు లభించాయి. ఈ గుర్తింపులు సమాజానికి సేవ చేయడంలో మా విశ్వసనీయత మరియు నిబద్ధతకు నిదర్శనం.

మా CSR భాగస్వాములు ఏమంటున్నారంటే

సమాజంలో సానుకూలమైన, శాశ్వతమైన మార్పును తీసుకురావడానికి మా భాగస్వాములు నారాయణ సేవా సంస్థతో ఎలా కలిసి పనిచేస్తున్నారో తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

CSR కార్పొరేట్ సామాజిక భాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) అంటే ఒక సంస్ధ తమ వ్యాపారంతో పాటు సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండటం. సమాజం, పర్యావరణం మరియు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా మంచి మార్పు తీసుకురావడం.

విద్యా కార్యక్రమాలకు సహాయం చేయడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సేవలు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం మరియు వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలు CSRలోకి వస్తాయి.

CSRలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఉదాహరణకు సేవా కార్యక్రమాలు, ఉద్యోగుల వాలంటీర్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలు మరియు సమాజ అభివృద్ధి కార్యక్రమాలు.

 

అవును, మా లక్ష్యాలకు అనుగుణంగా సామాజిక సంక్షేమం, పారదర్శకత మరియు సేవా కార్యక్రమాలను వివరించే స్పష్టమైన CSR పాలసీ మాకు ఉంది.

CSR నిధులను మా సేవా కార్యక్రమాల కోసం పూర్తి పారదర్శకతతో ఉపయోగిస్తాము. నిధులు సరిగ్గా వినియోగించబడుతున్నాయో తెలుసుకునేందుకు నివేదికలు మరియు ఆడిట్ల ద్వారా పూర్తి వివరాలను అందిస్తాం.

CSR వల్ల సమాజానికి, పర్యావరణానికి ప్రయోజనం కలగడమే కాకుండా, సంస్ధకి మంచి పేరు, ఉద్యోగుల్లో సంతృప్తి మరియు భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇది సంస్ధ దీర్ఘకాలిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది.

CSR మరియు సుస్థిరత రెండూ దగ్గరగా సంబంధం కలిగి ఉంటాయి. CSR కార్యక్రమాల ద్వారా పర్యావరణం, సమాజం మరియు ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టి, స్థిరమైన అభివృద్ధికి సహాయం చేయవచ్చు.

CSR వల్ల సంస్ధకి మంచి పేరు, కస్టమర్ల నమ్మకం, ఉద్యోగుల సంతృప్తి, ఉద్యోగులను కొనసాగించగలగడం మరియు భాగస్వాములతో మంచి సంబంధాలు వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

CSR ద్వారా సంస్ధలు తమ కస్టమర్లు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు మరియు ఇతర భాగస్వాముల్లో నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలాగే ప్రమాదాలను తగ్గించుకుని, దీర్ఘకాలంలో సంస్ధ అభివృద్ధికి సహాయపడుతుంది.

అవును. సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం కోసం సమగ్ర CSR వ్యూహం మా వద్ద ఉంది.

CSR సహకారం వల్ల మా సేవలను మరింత మంది అవసరంలో ఉన్నవారికి చేరవేయగలుగుతాం. సమాజంతో మా అనుబంధం బలపడుతుంది, మరిన్ని భాగస్వామ్యాలు మరియు వనరులు అందుతాయి. దీని ద్వారా దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయాలనే మా లక్ష్యాన్ని మరింత విస్తృతంగా కొనసాగించగలుగుతాం.

సులభమైన మాటల్లో చెప్పాలంటే, CSR అంటే సంస్ధలు సమాజం మరియు పర్యావరణంపై తమ వ్యాపారం వల్ల కలిగే ప్రభావానికి బాధ్యత వహించడం. ఇందులో నిజాయితీతో కూడిన వ్యాపార విధానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని తమ వ్యాపారం మరియు నిర్ణయాల్లో భాగంగా చేసుకోవడం ఉంటుంది..

 

దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయాలనే మా లక్ష్యాలు, విలువలను పంచుకునే సంస్ధలు, ఫౌండేషన్లు మరియు వ్యక్తులు మా కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు.మీ సంస్థకు అనుకూలమైన CSR కార్యక్రమాలు మరియు భాగస్వామ్య అవకాశాల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి.

 

చాట్ ప్రారంభించండి