కార్తీక మాసంలోని అమావాస్య రాత్రి ఇళ్లలో, ఇంటి ముందు వరుసగా దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల వెలుగుతో ఎటుచూసినా భక్తి భావం, ఆనందం నిండిపోతాయి. దీపాల పండుగ అయిన దీపావళి మన జీవితాల్లో కొత్త ఆశలు, సిరిసంపదలు, మంచి ఆరంభాలను తీసుకొస్తుంది. మనలోని మంచితనాన్ని వెలిగించుకోవడానికి, మంచి పనులు చేయడానికి, ధర్మం, దయ, ప్రేమతో కలిసి మెలిసి జీవించడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుంది.
సనాతన ధర్మంలో, దీపావళిని సంతోషం, ఐశ్వర్యం మరియు కొత్త ఆరంభాల కలయికగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున, భక్తులు లక్ష్మీదేవిని మరియు వినాయకుడిని పూజించి, తమ కుటుంబాల్లో శాంతి, సౌఖ్యాలు ప్రసాదించాలని వేడుకుంటారు. కేవలం పూజలు, పండుగ సంబరాలకే పరిమితం కాకుండా, మనలాంటి సంతోషాలు మరియు సౌకర్యాలు లేని వారి గురించి కూడా ఆలోచించాలని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం లేదా ఒకరి ముఖంలో నవ్వుని తీసుకురావడం లాంటి పనులు చేయడం వల్లే దీపావళికి నిజమైన అర్థం వస్తుంది.
హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి వస్తుంది. సూర్యాస్తమయం సమయంలో వచ్చే ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడం మరియు లక్ష్మీదేవిని పూజించడం ఈ రోజు ఉండే ముఖ్యమైన ఆచారాలు.
ద్రిక్ పంచాంగపు లెక్కల ప్రకారం, 2026 నవంబర్ 8, ఆదివారం దీపావళి పండుగని జరుపుకుంటారు. అమావాస్య తిథి నవంబర్ 8న ఉదయం 11:27 గంటలకు ప్రారంభమై, నవంబర్ 9న మధ్యాహ్నం 12:31 గంటలకు ముగుస్తుంది.
దీపావళి సాయంత్రం మహాలక్ష్మీదేవిని, వినాయకుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవిని సిరిసంపదలు, ఐశ్వర్యం, అదృష్టం, అభివృద్ధిని ప్రసాదించే దేవతగా కొలుస్తారు. వినాయకుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగా, ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పూజించే దేవుడిగా ఆరాధిస్తారు. అందుకే దీపావళి రోజున ఈ ఇద్దరు దేవుళ్లను కలిపి పూజించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం.
పంచాంగం ప్రకారం, 2026 నవంబర్ 8న లక్ష్మీ పూజకు సాయంత్రం 5:54 గంటల నుంచి 7:50 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది. ఈ సమయంలో భక్తులు పూజలు చేసి, తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు ఉండాలని ప్రార్థించవచ్చు.
పూజ ప్రారంభించే ముందు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. భక్తితో, కృతజ్ఞతా భావంతో, ప్రశాంతమైన మనసుతో పూజ చేయాలి. పూజకు సరైన సమయం, పూజ చేసే విధానం మీ కుటుంబ సంప్రదాయాలు, మీ ప్రాంతపు పంచాంగం ప్రకారం నిర్ణయించుకోవాలి.
దీపావళి పండుగ మనలోని మంచి గుణాలను వెలిగించుకోవాలని సందేశం ఇస్తుంది. చిన్న దీపం వెలుగు మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా, చిన్న వెలుగు కూడా దాన్ని తొలగించగలదు. అలాగే, నిజాయితీగా ఉండటం, మంచి విషయాలు తెలుసుకోవడం, ధర్మం ప్రకారం నడుచుకోవడం ద్వారా మనలోని అజ్ఞానం, అసూయ, కోపం, అహంకారం వంటి చెడు గుణాలను తొలగించుకోవచ్చు.
సనాతన ధర్మ సంప్రదాయాల్లో దీపావళిని ధర్మానికి, శుభానికి, కొత్త ఆరంభాలకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ సమయంలో ప్రజలు ఇళ్లను శుభ్రం చేస్తారు, దేవాలయాలను అలంకరిస్తారు, దీపాలు వెలిగిస్తారు, తమ ఇష్టదైవాలను భక్తితో స్మరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమను పంచుకోవడానికి, పాత మనస్పర్థలను తొలగించుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయతతో బంధాలను మరింత బలపరచుకోవడానికి కూడా దీపావళి ఒక మంచి అవకాశం.
దీపావళికి సంబంధించి అత్యంత ప్రసిద్ధమైన నమ్మకాల్లో ఒకటి శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావడము. సంప్రదాయం ప్రకారం, శ్రీరాముడు పదహాలు (పద్నాలుగు) సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని, రావణాసురుడిని ఓడించిన తర్వాత సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారు. వారి రాకను ఆనందంగా స్వాగతిస్తూ అయోధ్య ప్రజలు వరుసగా దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నారు.
దీపావళి సంప్రదాయం శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ప్రాచీన సాహిత్యం, మతపరమైన గ్రంథాలు, చారిత్రక రచనల్లో దీపోత్సవం, దీపమాలిక వంటి దీపాల పండుగల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. పద్మ పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాల్లో కూడా దీపావళికి సంబంధించిన సంప్రదాయాలు, దీపాలు వెలిగించడం వల్ల కలిగే ప్రాముఖ్యత గురించి వివరించారు.
భారతీయ సంస్కృతిలో దీపం జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి చిహ్నంగా భావిస్తారు. దీపం వెలిగించేటప్పుడు తమ జీవితాల్లో జ్ఞానం, మంచి ఆలోచనలు నిండాలని ప్రజలు ప్రార్థిస్తారు. అందుకే పూజలు, మతపరమైన కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో దీపాలు వెలిగించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ ఆచారాలు, మతపరమైన విశ్వాసాల ప్రకారం దీపావళిని జరుపుకుంటారు. కొందరు ఈ పండుగని శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా భావిస్తారు. మరికొందరు లక్ష్మీదేవి పూజకి, కొత్త వ్యాపార సంవత్సర ప్రారంభానికి, తమ ప్రాంతాల్లో పాటించే ఇతర మతపరమైన ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఆచారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, దీపావళి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఒక్కటే — వెలుగు, శుభం, అందరి మధ్య ప్రేమ, ఐకమత్యం.
దీపావళి అంటే విస్తృతమైన పండుగల కాలంలో భాగంగా జరుపుకునే అనేక ఇతర పండుగల లాంటిదే. ఇవన్నీ కలిసి సాధారణంగా ఐదు నుండి ఆరు రోజుల పాటు సాగుతాయి.
ధన్తేరస్ (ధనత్రయోదశి): ఈ పండుగ దీపావళికి ముందు రోజు వస్తుంది; ఇది సంపద, మంచి ఆరోగ్యం మరియు శుభారంభాలకి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ధన్వంతరి దేవుడిని మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు. కుటుంబ సంప్రదాయాలను బట్టి, చాలా మంది కొత్త పాత్రలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
నరక చతుర్దశి: ఇది 5 రోజుల దీపావళి పండుగలో రెండవ రోజు. దీనిని ‘ఛోటీ దీపావళి (చిన్న దీపావళి)’ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు జీవితం నుండి వ్యతిరేకతని (ప్రతికూలతని) తొలగించడాన్ని సూచిస్తుంది. ఈ రోజున శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆచారాలు కూడా ఉన్నాయి.
దీపావళి: ప్రధాన పండుగ రోజున, ప్రజలు లక్ష్మీదేవిని, వినాయకుడిని మరియు తమ కుటుంబాలు ఆరాధించే దేవుళ్లను పూజిస్తారు. ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఇళ్లలో, దేవాలయాలలో మరియు ఆవరణలలో దీపాలు వెలిగిస్తారు.
గోవర్ధన పూజ: ఈ రోజున శ్రీకృష్ణుడు బ్రజ్ ప్రాంత ప్రజలను కాపాడటానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కథను గుర్తు చేసుకుంటారు. ప్రకృతికి, పశువులకు, సమాజంలోని అందరికీ కృతజ్ఞతతో ఉండాలని ఈ పండుగ మనకు సందేశం ఇస్తుంది.
భాయ్ దూజ్: ఈ పండుగ అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయతా బంధాన్ని వేడుకగా జరుపుకుంటుంది. సోదరులు సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సుభిక్షంగా ఉండాలని సోదరీమణులు ప్రార్థిస్తారు.
దీపావళి రోజు ఉదయమే లేచి, తలస్నానం చేసి, ఇల్లు మరియు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం సమయంలో ఒక పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు బట్టను పరిచి, లక్ష్మీదేవి మరియు వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలి. మీ కుటుంబ ఆచారాలు లేదా పండితుల సూచనల ప్రకారం విగ్రహాలను అమర్చాలి.
దీపం వెలిగించి, దేవుళ్లను ధ్యానం చేసి, పూజ చేయడానికి సంకల్పం చెప్పుకోవాలి. పూలు, అక్షతలు, చందనం, ధూపం, దీపాలు, పండ్లు, పాయసం, బతాషా మిఠాయిలు, లాయి (పేలాలు) మరియు ఇతర మిఠాయిలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూలు, నైవేద్యం సమర్పించాలి; అలాగే వినాయకుడికి గరిక (దుర్వ) మరియు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.
తర్వాత లక్ష్మీదేవి, వినాయకుడి మంత్రాలను జపించాలి. లక్ష్మీ చాలీసా, శ్రీసూక్తం లేదా మీ కుటుంబంలో సంప్రదాయంగా పఠించే ప్రార్థనను చదివి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇంటి గుమ్మం దగ్గర, ఆవరణలో, పూజ చేసే ప్రదేశం చుట్టూ దీపాలు వెలిగించాలి.
కుటుంబ ఆచారాలు మరియు ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి పూజా విధానాలు మారుతుంటాయని గమనించండి. కాబట్టి మీ సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ, భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ఉత్తమం.
దీపావళి రోజున ప్రార్థనలు చేయడం, మంత్రాలు పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితాన్ని సానుకూలంగా చూసే దృక్పథం పెరుగుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులోని ఈ ప్రసిద్ధ మంత్రం వెలుగు, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలియజేస్తుంది.
అసతో మా సద్గమయ.
తమసో మా జ్యోతిర్గమయ.
మృత్యోర్ మా అమృతమ్ గమయ.
ఓం శాంతిః, శాంతిః, శాంతిః.
అర్థం: ఓ భగవంతుడా! మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మరణం నుంచి అమరత్వం వైపు నడిపించు.
ఈ ప్రార్థన దీపావళి ఆధ్యాత్మిక సందేశంతో ఎంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. మన చుట్టూ మాత్రమే కాకుండా, మన ఆలోచనల్లో, పనుల్లో కూడా జ్ఞానం, నిజాయితీ, ధర్మం అనే వెలుగును నింపుకోవాలని ఇది మనకు స్ఫూర్తినిస్తుంది.
మన వేడుకల్లో అవసరంలో ఉన్నవారిని కూడా భాగస్వాములను చేసినప్పుడే దీపావళి సంతోషం మరింత అర్థవంతంగా మారుతుంది. సనాతన సంప్రదాయంలో దానం చేయడం, ఇతరుల పట్ల దయ చూపించడం, ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం ముఖ్యమైన మంచి గుణాలుగా భావిస్తారు. ఈ పండుగ సమయంలో అవసరంలో ఉన్న కుటుంబానికి భోజనం అందించడం, పండుగకు కావాల్సిన వస్తువులు ఇవ్వడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం లేదా పేద పిల్లల ముఖంలో చిరునవ్వు తీసుకురావడం ద్వారా మనం ఇతరులకు సేవ చేయవచ్చు.
ఈ సేవాభావంతో నారాయణ సేవా సంస్థ “హర్ ఘర్ ఖుషియోన్ కీ దీపావళి” (ప్రతి ఇంటా సంతోషాల దీపావళి) అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరంలో ఉన్నవారికి గిఫ్ట్ బాక్సులను అందిస్తున్నారు. ప్రతి బాక్స్‌లో పూజకు అవసరమైన వస్తువులు, టపాసులు, దుస్తులు, మిఠాయిలు ఉంటాయి.
పేదలు, నిస్సహాయులు, అవసరంలో ఉన్నవారి దీపావళి కూడా సంతోషంగా జరగడానికి మీ వంతు సహాయం చేయండి. మీ సహకారం ఒక కుటుంబానికి పండుగ జరుపుకునే ఆనందాన్ని ఇవ్వగలదు. అవసరంలో ఉన్న ఒకరి జీవితంలో కొత్త ఆశల వెలుగును నింపగలదు.
దీపావళి అనేది మన గుండెల్లో భక్తిని, ఆలోచనలలో పవిత్రతను, చేతలలో నిస్వార్థ సేవా భావాన్ని మేల్కొలిపే అవకాశం. లక్ష్మీదేవిని మరియు వినాయకుడిని పూజిస్తూ, మన జీవితంలో సత్యం, ధర్మం, వినయం మరియు దయను అలవర్చుకుందాం అని ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ దీపావళి రోజున మీ కుటుంబంతో ప్రేమని పంచుకోండి, ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండండి, అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి మరియు పండుగని ఆనందంగా జరుపుకోండి. మనలోని అజ్ఞానాన్ని తొలగించి, ఇతరుల జీవితాల్లో ఆశను నింపేదే అసలైన వెలుగు అని ప్రతిరోజూ దీపాలు మనకు గుర్తుచేయనివ్వండి.
మహాలక్ష్మి దేవి మరియు వినాయకుడు అందరికీ సంతోషం, శాంతి, జ్ఞానం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఇల్లు ప్రేమ వెలుగులతో ప్రకాశించాలని, ప్రతి హృదయం సేవ మరియు సద్భావనతో వెలగాలని ఆశిస్తున్నాము.
2026 న అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు!
ప్రశ్న. 2026లో దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు?
2026 నవంబర్ 8న దీపావళి పండుగని జరుపుకుంటారు.
ప్రశ్న. 2026 లో దీపావళి రోజున ఏ సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి పూజకు శుభ ముహూర్తం వస్తుంది?
పంచాంగం ప్రకారం, 2026 లో నవంబర్ 8న లక్ష్మీ పూజకు సాయంత్రం 5:54 గంటల నుంచి 7:50 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది.
ప్రశ్న. దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు?
దీపాలు వెలిగించడం వెలుగుకి, జ్ఞానానికి, శుభానికి, ఆశకు చిహ్నం. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో కూడా దీపాలు వెలిగించి స్వాగతం పలికారనే సంప్రదాయంతో ఈ ఆచారం ముడిపడి ఉంది.
ప్రశ్న. నారాయణ సేవా సంస్థ చేపట్టిన “హర్ ఘర్ ఖుషియోన్ కీ దీపావళి (ప్రతి ఇంటా సంతోషాల దీపావళి)” కార్యక్రమంలో నేను ఎలా పాల్గొనవచ్చు?
నారాయణ సేవా సంస్థ వెబ్‌సైట్ ద్వారా విరాళం అందించి, “హర్ ఘర్ ఖుషియోన్ కీ దీపావళి” సేవా కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించవచ్చు.