12 November 2026

సుకున్ భరీ సర్దీ (సుఖమయమైన శీతాకాలం/ చలికాలంలో హాయిగా ఉండే వెచ్చదనం): మీ సహాయం అవసరంలో ఉన్నవారికి వెచ్చదనాన్ని ఇస్తుంది!

Start Chat

చలికాలం మొదలవ్వగానే వెచ్చని దుస్తులు, దుప్పట్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ మన సమాజంలో చాలామంది చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన కనీస వస్తువులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి చలి నుంచి రక్షణ పొందడానికి ఒక స్వెటర్ కూడా ఉండదు. మరికొందరికి చలికాలపు రాత్రులను గడపడానికి కనీసం ఒక దుప్పటి కూడా అందుబాటులో ఉండదు. రోడ్ల పక్కన, ఆరుబయట నిద్రించే వారు, పేదరికంలో జీవించే కుటుంబాలు, చలికి కాళ్లు గడ్డకట్టే పరిస్థితుల్లో స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు… ఇలా ఎంతోమంది ప్రతి సంవత్సరం చలికాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చలికాలానికి అవసరమైన వెచ్చని దుస్తులు అందుబాటులో లేకపోతే, ప్రతి రోజూ, ప్రతి రాత్రి చలిని తట్టుకోవడం వారికి ఎంతో కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వెచ్చని స్వెటర్, ఒక దుప్పటి లేదా చిన్నపిల్లలకు ఒక జత ఉన్ని టోపీలు, బూట్లు, సాక్స్ ఇవ్వడం అంటే కేవలం దుస్తులు ఇచ్చినట్లు కాదు. అవి చలి నుంచి వారికి ఎంతో అవసరమైన రక్షణను, ఉపశమనాన్ని అందిస్తాయి.

ఈ అవసరాన్ని గుర్తించిన నారాయణ సేవా సంస్థ, ‘సుకూన్ భరీ సర్ది’ (చలికాలంలో వెచ్చని ఉపశమనం) అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలు, నిస్సహాయులు, అవసరంలో ఉన్నవారికి లక్ష స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. అంతేకాకుండా, చిన్నపిల్లలు చలి బారిన పడకుండా వారికి స్వెటర్లు, ఉన్ని టోపీలు, బూట్లు, సాక్స్ అందించాలని కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒక్కటే అవసరంలో ఉన్న ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చలికాలపు కష్టాలను ఒంటరిగా ఎదుర్కోకూడదు. ప్రతి ఒక్కరికీ చలి నుంచి రక్షణ, వెచ్చదనం అందాలి.

 

చలికాలం  కొందరికి ఆహ్లాదం, మరికొందరికి జీవితంలో ఓ కఠినమైన పరీక్షగా మారినప్పుడు!

కొందరికి చలికాలం అంటే ఆహ్లాదకరమైన ఎండ, వేడివేడి టీ, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలు. కానీ మరికొందరికి ఇదే చలికాలం ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై రాత్రిళ్లు నిద్రించే వారు, మురికివాడల్లో నివసించే కుటుంబాలు, ఆదుకోవడానికి ఎవరూ లేని వృద్ధులు, అతి తక్కువ ఆదాయంతో జీవనం సాగించే వారు చలికి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.

రోజుకు రెండు పూటల భోజనం సంపాదించుకోవడమే కష్టంగా ఉన్న కుటుంబాలు, ఇక వెచ్చని దుస్తులు, దుప్పట్లు ఎలా కొనగలవు? రోజువారీ అవసరాలకే తమ సంపాదన మొత్తం ఖర్చు చేసే కుటుంబాలకు పిల్లల కోసం చలికాలపు దుస్తులు కొనడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీంతో గడ్డకట్టే చలి, చల్లని గాలులు వారి కష్టాలను మరింత పెంచుతున్నాయి.

ఒకరికి స్వెటర్ అనేది చలికాలంలో వేసుకునే సాధారణ దుస్తులు మాత్రమే కావచ్చు. కానీ మరొకరికి అదే స్వెటర్ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే అమూల్యమైన సహాయం కావచ్చు. కొన్ని ఇళ్లలో అవసరానికి మించి దుప్పట్లు ఉంటాయి. కానీ మరికొన్ని కుటుంబాలు కనీసం ఒక్క దుప్పటి కూడా లేక రాత్రంతా చలిలోనే గడుపుతుంటాయి. ఈ వ్యత్యాసం మనలో మానవత్వం, దయ, జాలి ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. అవసరంలో ఉన్నవారికి మనకు చేతనైన సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రేరణ కలిగిస్తుంది.

సుకూన్ భరీ సర్దీ: ఒక శీతాకాల సేవా కార్యక్రమం

నారాయణ సేవా సంస్థ ప్రారంభించిన ‘సుకూన్ భరీ సర్ది’ కార్యక్రమం అంటే మనలోని దయ, మానవత్వాన్ని చేతల్లో చూపించే ఒక మంచి సేవా ప్రయత్నం. ఈ కార్యక్రమం ద్వారా లక్ష(1,00,000) స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చలి నుంచి తమను తాము కాపాడుకోలేని పేదలు, అవసరంలో ఉన్నవారికి కొంత ఉపశమనం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఒక చిన్నపిల్ల భుజాలపై వెచ్చని స్వెటర్ వేయడం అంటే కేవలం చలి నుంచి రక్షణ కల్పించడమే కాదు ఆ పిల్లపై మనకున్న ప్రేమ, ఆప్యాయతను కూడా తెలియజేయడం. అలాగే, అవసరంలో ఉన్న ఒక కుటుంబానికి దుప్పటి అందించడం అంటే గడ్డకట్టే చలిలో వారికి కొంత వెచ్చదనంతో పాటు, హాయిగా రాత్రి గడపగలమనే నమ్మకాన్ని ఇవ్వడం. నిజమైన సహాయం అంటే ఎదుటివారి కష్టాలను కొంతైనా తగ్గించడం, వారికి ఉపశమనం కలిగించడం. అదే సమయంలో వారి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూడటం.

నారాయణ సేవా సంస్థ సేవా స్ఫూర్తికి ‘నర సేవయే నారాయణ సేవ’ అనే గొప్ప నమ్మకం ఆధారం. అంటే, మనుషులకు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడంతో సమానం. ఈ భావన ప్రకారం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అనేది కేవలం దానం చేయడం మాత్రమే కాదు… ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూస్తూ, మానవత్వంతో సేవ చేయడం.

 

చిన్నారుల అమాయక బాల్యాన్ని చలి బారి నుంచి కాపాడండి.

బాల్యం అంటే నవ్వులు, ఆటపాటలు, చదువులు, ఎన్నో కలలు కనే అందమైన సమయం. కానీ పేదరికంలో జీవించే చాలామంది పిల్లలకు చలికాలం ఈ చిన్న చిన్న ఆనందాలకు అడ్డంకిగా మారుతోంది. చల్లటి ఉదయాన్నే స్వెటర్ లేకుండా స్కూల్‌కి వెళ్లడం, బూట్లు లేకుండా చల్లని రోడ్లపై నడవడం, సరైన వెచ్చని దుస్తులు లేక చలిలోనే చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించడం ఇవన్నీ చిన్నారులకు ఎంతో కష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు చలి కారణంగా పిల్లలు రోజూ స్కూల్‌కి వెళ్లడం కూడా కష్టమవుతుంది.

నారాయణ సేవా సంస్థాన్ ప్రారంభించిన ‘సుకూన్ భరీ సర్ది’ కార్యక్రమం చిన్నారులకు కూడా చలి నుంచి వెచ్చని రక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా అవసరంలో ఉన్న పిల్లలకు స్వెటర్లు, ఉన్ని టోపీలు, చేతి తొడుగులు, బూట్లు, సాక్స్ అందిస్తున్నారు. ఇవి పిల్లలను చలి నుంచి కాపాడటమే కాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ చదువును కొనసాగించడానికి కూడా సహాయపడతాయి. స్వెటర్ పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉన్ని టోపీ చల్లని గాలుల నుంచి తలని కాపాడుతుంది. బూట్లు, సాక్స్ వారి చిన్న చిన్న పాదాలను చలి నుంచి రక్షిస్తాయి.

 

మీరు చేసే చిన్న సహాయం కూడా ఒక గొప్ప సేవా కార్యక్రమంలో భాగం కావచ్చు.

పెద్ద సముద్రం కూడా చిన్న చిన్న నీటి బిందువులు కలిస్తేనే ఏర్పడుతుంది అని ఒక సామెత ఉంది. అవసరంలో ఉన్న ఎంతోమందికి సహాయం చేయాలనే లక్ష్యంతో చేపట్టే సేవా కార్యక్రమాలకు కూడా ఇది చక్కగా సరిపోతుంది. ఒక్కొక్కరు చేసే సహాయం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఎంతోమంది దయగల మనసున్న వ్యక్తులు ఒక మంచి లక్ష్యం కోసం చేతులు కలిపితే, వారి చిన్న చిన్న సహాయాలన్నీ కలిసి సమాజంలో పెద్ద మార్పును తీసుకురాగలవు.

ఒక లక్ష (1,00,000) స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేయాలనే ఈ గొప్ప లక్ష్యాన్ని ప్రజల సహకారంతోనే నెరవేర్చవచ్చు. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా వెచ్చని దుస్తులను సేకరించి, వాటిని నిజంగా అవసరమైన వారికి అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మీ వంతు సహాయం చేయవచ్చు. 

కాబట్టి, మనకు వీలైనంతలో ఈ సేవా కార్యక్రమానికి మన వంతు సహాయం అందిద్దాం. మీరు చేసే చిన్న సహాయం కూడా అవసరంలో ఉన్న ఒకరికి స్వెటర్ అందించవచ్చు, ఆదరణ లేని ఒక వ్యక్తికి దుప్పటి అందించవచ్చు లేదా చలితో ఇబ్బంది పడుతున్న ఒక చిన్నారికి వెచ్చని దుస్తులు అందించవచ్చు. ఇక్కడ ఎంత సహాయం చేశామన్నది ముఖ్యం కాదు మనస్ఫూర్తిగా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములం కావడమే ముఖ్యం. ఎందుకంటే, మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మరొకరి జీవితంలో కష్టాలను తగ్గించి, కొంత ఉపశమనాన్ని కలిగించగలదు.

 

ఈ చలికాలంలో మీ చిన్న సాయంతో మరొకరి జీవితంలో వెచ్చదనాన్ని, సంతోషాన్ని నింపండి.

మళ్లీ చలికాలం వస్తుంది… చల్లని గాలులు వీస్తాయి… రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. కానీ ఈ ఏడాదైనా చలితో ఇబ్బంది పడుతున్న వారికి ఆ చలి నుంచి కాపాడుకునే వెచ్చని దుస్తులు అందేలా మనం ఒక చిన్న ప్రయత్నం చేయలేమా? మనలోని దయ, మానవత్వాన్ని ఆదుకోవడానికి ఎవరూ లేని ఒక వృద్ధుడికి, కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి లేదా ఏమీ తెలియని ఒక చిన్నారికి వెచ్చని దుస్తులు, ఆప్యాయత రూపంలో అందించలేమా?

‘సుకూన్ భరీ సర్ది’ అనేది ఇతరుల కష్టాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని, వారి బాధలను కొంతైనా తగ్గించేందుకు మన వంతు సహాయం చేయాలనే మానవత్వంతో కూడిన ఒక మంచి సంకల్పం.

నారాయణ సేవా సంస్థాన్ చేపట్టిన ఈ చలికాలపు సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అవసరంలో ఉన్నవారికి లక్ష((1,00,000) స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేయాలనే ఈ గొప్ప లక్ష్యంలో మీ వంతు సహాయం అందించండి. మీరు చేసే సహాయం ఎవరికో ఒకరికి భుజాలపై వెచ్చని స్వెటర్ రూపంలో చేరవచ్చు. చలితో వణికిపోయే వారికి రాత్రిపూట హాయినిచ్చే దుప్పటిగా మారవచ్చు. లేదా ఒక చిన్నారి ముఖంలో చిరునవ్వు పూయించవచ్చు. మీ చిన్న సహాయం మరొకరి జీవితంలో ఎంతో వెచ్చదనాన్ని, ఆనందాన్ని నింపవచ్చు!

 

ఈ చలికాలంలో మీ దయ, మంచితనం అవసరంలో ఉన్నవారి జీవితాల్లో వెచ్చదనాన్ని, హాయిని, కొత్త ఆశలను నింపనివ్వండి!

X
Amount = INR