• +91-7023509999
  • 0294-6622222
  • info@narayanseva.org

Narayan Seva Sansthan - యోగిని ఏకాదశి

యోగిని ఏకాదశి నాడు నిరుపేద మరియు దివ్యాంగ పిల్లలకు భోజనం అందించండి

యోగినీ ఏకాదశి

X
Amount = INR

సనాతన ధర్మంలో యోగినీ ఏకాదశికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశి వ్రతం సమస్త పాపాలను నశింపజేస్తుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం యోగినీ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించడం వల్ల ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు శ్రీహరి మహావిష్ణువు పూజకు, దానధర్మాలకు మరియు నిస్వార్థ సేవకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.

యోగినీ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించడం వల్ల శరీరం, మనస్సు మరియు ఆత్మ శుద్ధి అవుతాయి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఉపవాసం, ప్రార్థనలు, ధ్యానం చేయడం మరియు అవసరాల్లో ఉన్నవారికి సేవ చేయడం వల్ల జీవితంలోకి సంతోషం, ఐశ్వర్యం మరియు దైవానుగ్రహం లభిస్తాయి.

 

యోగిని ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ప్రాచీన శాస్త్రాల ప్రకారం, యోగినీ ఏకాదశి అనేది సమస్త పాపాలను మరియు కష్టాలను తొలగించే ఒక పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజున భక్తితో ఉపవాస వ్రతాన్ని పాటించి, శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా ఒకరు తమ గత తప్పుల (పాపాల) నుండి విముక్తి పొంది, జీవితంలో ఒక మంచి సానుకూల మార్పును పొందవచ్చు. ఈ పవిత్రమైన సందర్భం భక్తి ద్వారా మనస్సు శుద్ధిని మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను సాధించడానికి ఒక అద్భుతమైన దైవిక అవకాశాన్ని కల్పిస్తుంది.

ధార్మిక గ్రంథాల ప్రకారం, యోగిని ఏకాదశి రోజున సంపాదించే పుణ్యఫలాలు వ్యక్తుల లోకిక కష్టాలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతి మార్గంలో ముందుకు సాగేందుకు సహాయపడతాయి. అందువల్ల ఈ రోజున దానధర్మాలు చేయడం, ఇతరులకు సేవ చేయడం మరియు అందరిపట్ల కరుణా భావంతో ఉండటం చాలా ముఖ్యం.

దానం చేయడం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి:

దానేన్ భూతాని వశీ భవన్తి దానేన్ వైరణ్యపి యాన్తి నాశమ్ ।

 పరోయపి బంధుత్వముపైతి దానేర్ దానం హి సర్వవ్యాసనానాని హంతి॥

అర్థం: దానం చేయడం వల్ల సమస్త జీవులకూ సంతోషం కలుగుతుంది, శత్రుత్వం నశిస్తుంది, పైగా పరాయి వాళ్లు కూడా మనకు స్నేహితులు అవుతారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను, లోపాలను దూరం చేసే శక్తి ఒక్క దానధర్మాలకే ఉంది.

 

పేద పిల్లలకు, దివ్యాంగులకు అన్నదానం చేసి దేవుడి ఆశీస్సులు పొందండి.

పవిత్రమైన యోగిని ఏకాదశి రోజున ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున, నారాయణ సేవ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మీరు కూడా భాగం అవ్వండి. పేద, నిరాశ్రయ, దివ్యాంగ మరియు అవసరాల్లో ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మీ వంతు సాయం చేయండి.

ఈ యోగిని ఏకాదశి రోజున.. సేవ, దానధర్మాలు చేసే ఈ గొప్ప ఆశయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. కష్టాల్లో ఉన్నవారికి మీ వంతు సాయం అందిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత పవిత్రం చేసుకోండి.

యోగిని ఏకాదశి

యోగిని ఏకాదశి సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన, దివ్యాంగ పిల్లల అన్నదానానికి మీ వంతు సాయం అందించండి.

మీరు ఇచ్చే విరాళం దివ్యాంగులైన పిల్లలకు మరియు అవసరాల్లో ఉన్నవారికి భోజనం అందించడానికి ఎంతో సహాయపడుతుంది.

Bank Details

Account Name
Narayan Seva Sansthan
Bank Name
STATE BANK OF INDIA
Account Number
31505501196
IFSC Code
SBIN0011406
Avail tax exemption under Section 80G
చిత్ర గ్యాలరీ
చాట్ ప్రారంభించండి