05 September 2026

భాద్రపద అమావాస్య 2026: శ్రీ హరి ఆశీస్సులు పొందడానికి చేయాల్సిన విధులు; తేదీ మరియు ముహూర్తం

Start Chat

హిందూ పంచాంగంలో అమావాస్య తిథికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఆత్మపరిశీలన చేసుకోవడానికి, పూర్వీకులను స్మరించుకోవడానికి, తర్పణం వదలడానికి, పవిత్ర స్నానాలు చేయడానికి మరియు దానధర్మాలు చేయడానికి ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర దినాలలో, భాద్రపద మాసం కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనినే భాద్రపద అమావాస్య, కుశగ్రాహిణి అమావాస్య మరియు కుశోత్పాటిని అమావాస్య అని కూడా పిలుస్తారు.

ఈ రోజున మన పూర్వీకులకు మనస్ఫూర్తిగా తర్పణం ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి దానం చేయడం, శ్రీమహావిష్ణువును స్మరించుకోవడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అలాగే, జీవితంలో శాంతి, సంతోషం కలగడానికి ఇది దోహదపడుతుందని భక్తుల విశ్వాసం.

 

భాద్రపద అమావాస్య 2026 ఎప్పుడు జరుపుకుంటారు?

2026లో భాద్రపద అమావాస్యను సెప్టెంబర్ 11న జరుపుకుంటారు. అమావాస్య తిథి సెప్టెంబర్ 10 ఉదయం 10:33 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం 8:56 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్న తిథి (ఉదయ తిథి)ని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి, భాద్రపద అమావాస్యని సెప్టెంబర్ 11నే పాటిస్తారు.

ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడం, పూర్వీకులకు తర్పణం అర్పించడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, అవసరంలో ఉన్నవారికి దానధర్మాలు చేయడం మరియు దేవుడిని స్మరించుకోవడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని భావిస్తారు.

 

భాద్రపద అమావాస్య ఎందుకు ప్రత్యేకమైనది?

భాద్రపద అమావాస్యని కుశ గ్రహణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున భక్తులు పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగించే పవిత్రమైన కుశ గడ్డిని సేకరించడం ఆనవాయితీగా వస్తోంది.

సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, ఈ రోజున సరైన పద్ధతిలో తెచ్చిన దర్భ గడ్డిని ఏడాది పొడవునా పూజలు, హవనాలు, తర్పణాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యాలలో ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఈ పవిత్ర దినాన అవసరంలో ఉన్నవారికి దానధర్మాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు.

 

భాద్రపద అమావాస్య నాడు ఏం చేయాలి?

భాద్రపద అమావాస్య రోజున భక్తులు తమ శక్తి కొలదీ ఈ క్రింది ఆధ్యాత్మిక పనులను చేయాలి:

  • పవిత్ర స్నానం చేయడం: ఉదయాన్నే త్వరగా లేచి పుణ్యనదుల్లో స్నానం చేయాలి. ఒకవేళ నదికి వెళ్లడం వీలు కాకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగానది నీటిని కలుపుకుని స్నానం చేయవచ్చు.
  • సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వడం: స్నానం చేసిన తర్వాత రాగి చెంబుతో సూర్యునికి నీళ్లు వదిలి అర్ఘ్యం సమర్పించాలి. మంచి ఆరోగ్యం, సంతోషం మరియు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించాలి
  • రావి చెట్టు పూజించడం: రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, నిజమైన భక్తితో పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
  • జంతువులకు, పక్షులకు ఆహారం పెట్టడం : ఆవులకు పచ్చిగడ్డి, కాకులు మరియు కుక్కలకు ఆహారం ఇవ్వడం, అలాగే చీమలకు పిండి లేదా ఆహార పదార్థాలను వేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
  • దర్భ గడ్డి (కుశ గడ్డిని) సేకరించడం: ఈ రోజున కుశ గడ్డిని సరైన విధంగా సేకరించి, పూజలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది.

 

దర్భ (కుశ) గడ్డి  సేకరించే ధార్మిక విధానం

సనాతన ధర్మంలో కుశ గడ్డిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భను కోసే ముందు భక్తితో ఈ క్రింది ప్రార్థన చేయాలి:

కుశాగ్రే వసతే రుద్రః, కుశ మధ్యే తు కేశవః।

కుశమూలే వసే బ్రహ్మా, కుశాన్ మే దేహి మేదిని॥

ఈ శ్లోకం చదివిన తర్వాత, “ఓం హుం ఫట్” అనే మంత్రాన్ని జపిస్తూ దర్భను వేళ్లతో సహా జాగ్రత్తగా ఉపకశించాలి (పెకిలించాలి). దర్భ గడ్డి పచ్చగా, శుభ్రంగా మరియు ఏమాత్రం విరిగిపోకుండా పూర్తిగా ఉండాలి. మురికి ప్రదేశాల్లో, శ్మశానాలలో లేదా రోడ్లపై పడి ఉన్న దర్భను పూజలు, నోముల కోసం ఉపయోగించకూడదు.

ధార్మిక నమ్మకాల ప్రకారం, ఒకవేళ అమావాస్య సోమవారం నాడు వస్తే… ఆ రోజున సేకరించిన దర్భను దాదాపు 12 సంవత్సరాల వరకు పూజా కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు.

 

భాద్రపద అమావాస్య నాడు చేసే దానధర్మాల ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో దానం చేయడం పుణ్యం సంపాదించే గొప్ప మార్గాల్లో ఒకటిగా భావిస్తారు. ముఖ్యమైన ధార్మిక రోజుల్లో చేసే దానం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా, దేవుడికి చేసే సేవగా కూడా భావిస్తారు.

శాస్త్రాలలో దానం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా చెప్పబడింది:

స్వర్గాయుర్భూతికామేన తథా పాపోపశాంతయే।

ముముక్షుణా చ దాతవ్యం బ్రాహ్మణేభ్యస్తథాహవమ్॥

దీని అర్థం ఏంటంటే స్వర్గాన్ని, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను కోరుకునేవారు లేదా తమ పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించాలనుకునేవారు, అర్హత కలిగిన ఉపాసకులకు లేదా సరైన వ్యక్తికి పూర్తి భక్తి శ్రద్ధలతో దానం చేయాలి.

 

భాద్రపద అమావాస్య నాడు అన్నదానం చేయాలని సంకల్పం తీసుకోండి

ఆకలితో ఉన్న ఒక వ్యక్తి కడుపు నిండినప్పుడు, మనం ఇచ్చే ఆహారం కేవలం భోజనం మాత్రమే కాదు — అది ఒక సేవగా, పుణ్యకార్యంగా మారుతుందని అంటారు.

ఈ పవిత్రమైన భాద్రపద అమావాస్య సందర్భంగా, ఆకలితో ఉన్న ఒక పేద, అనాథ లేదా దివ్యాంగ చిన్నారికి అన్నం పెట్టడం అంటే మానవత్వంతో పాటు ఆ దేవుడికి సేవ చేసినట్లే. ఈ అమావాస్య నాడు, పేద మరియు దివ్యాంగులైన పిల్లలకు భోజనం అందించే నారాయణ సేవా సంస్థ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంకల్పం తీసుకోండి. మీరు చేసే చిన్న సాయం ఒక చిన్నారి ముఖంలో చెరిగిపోని నవ్వుని నింపుతుంది.

ఈ భాద్రపద అమావాస్య నాడు కేవలం మీ కోసమే కాకుండా, అవసరంలో ఉన్న ఇతరుల కోసం కూడా ప్రార్థించండి. మీ పూర్వీకులను స్మరించుకోండి, శ్రీ హరి నామాన్ని జపించండి మరియు అన్నదానం ద్వారా మానవ సేవ చేయండి. ఎక్కడైతే సేవా భావం ఉంటుందో, అక్కడ ఆ దేవుని కృపాకటాక్షాలు తప్పక ఉంటాయి.

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: భాద్రపద అమావాస్య 2026 ఎప్పుడు జరుపుకుంటారు?

సమాధానం: భాద్రపద అమావాస్యని సెప్టెంబర్ 11, 2026న జరుపుకుంటారు.

ప్రశ్న: భాద్రపద అమావాస్యని ‘కుశగ్రాహిణి అమావాస్య’ అని ఎందుకు పిలుస్తారు?

సమాధానం: ఏడాది పొడవునా పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించే పవిత్రమైన దర్భ గడ్డిని (కుశ) ఈ రోజున సేకరిస్తారు. అందుకే దీనిని కుశగ్రాహిణి అమావాస్య మరియు కుశోత్పాటిని అమావాస్య అని కూడా పిలుస్తారు.

ప్రశ్న: భాద్రపద అమావాస్య నాడు దర్భ గడ్డిని కోయవచ్చా?

సమాధానం: అవును, ఈ పవిత్ర దినాన ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం దర్భ గడ్డిని నియమ నిష్టలతో కోసి సేకరించవచ్చు.

ప్రశ్న: భాద్రపద అమావాస్య నాడు ఏ దానం చేయాలి?

సమాధానం: భాద్రపద అమావాస్య రోజున ‘అన్నదానం’ చేయడం అత్యంత పవిత్రమైనదిగా మరియు పుణ్యఫలాన్నిచ్చే దానంగా భావిస్తారు.

X
Amount = INR